About Us


"తెలంగాణ దిశ" తెలుగు దినపత్రిక ఈపేపర్ లోకి ప్రవేశం...,

https://telanganadishaepaper.com

వర్తమాన భవిష్యత్తుకు బాటలు వేస్తున్న డిజిటల్ మీడియా స్మార్ట్ ఫోన్ల విస్తృతి, కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో వార్తాపత్రికలపై క్రేజ్ తగ్గింది. ప్రస్తుత తరుణంలో డిజిటల్ మీడియా, ఈపేపర్ (ఎలక్ట్రానిక్ పేపర్) వర్తమాన భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే "తెలంగాణ దిశ" తెలుగు దినపత్రిక తాజా వార్తలు, సంఘటనలతో ఈ పేపర్ లోకి ప్రవేశించింది.

సీనియర్ జర్నలిస్ట్, ""తెలంగాణ దిశ" తెలుగు దినపత్రిక చీఫ్ ఎడిటర్ మెరుగు చంద్రమోహన్ కు జర్నలిజంలో సుమారు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. అనేక ప్రముఖ దినపత్రికలలో పనిచేశారు. ప్రస్తుతం ""తెలంగాణ దిశ" తెలుగు దినపత్రిక ను ప్రారంభించారు. కరోన మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో భౌతికంగా న్యూస్ పేపర్లు చదవడం చాలా వరకు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ లలో డిజిటల్ మీడియా రంగ ప్రవేశం చేసింది. స్మార్ట్ ఫోన్ల రాకతో అరచేతిలో ప్రపంచం ఆవిష్కృతమైంది. ప్రపంచంలో ఏ మూలన ఏ సంఘటన జరిగినా క్షణాల్లో సమాచారం చేరవేసే సాంకేతిక పెరిగిపోయింది. దీంతో డిజిటల్ మీడియాకు, ఈ పేపర్ లకు ఎనలేని ప్రాముఖ్యత ఏర్పడింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని "తెలంగాణ దిశ" తెలుగు దినపత్రిక "ఈ పేపర్" ను ప్రారంభించింది. సంఘటన జరిగిన క్షణాల్లో సమాచారాన్ని మీ ముందుకు తెచ్చేందుకు "తెలంగాణ దిశ" తెలుగు దినపత్రిక చేస్తున్న కృషికి మీ సహాయ సహకారాలు ఆశిస్తూ....